కరోనా వైరస్ తో పోరాడటానికి పురుషుల కంటే మహిళలకు ఎక్కువ యాంటీబాడీస్ ఉన్నాయని ముంబై లో చేసిన ఒక సెరో సర్వేలో వెల్లడి అయింది. గతంలో కంటే ఇప్పుడు దారావి ప్రాంతంలో కేసులు భారీగా పెరుగుతున్నాయని సర్వే తెలిపింది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ సర్వేలో శనివారం వెల్లడైన వివరాల ప్రకారం, మహిళల్లో సెరో పాజిటివిటీ 37.12 శాతంగా ఉంది, పురుషులలో 35.02 శాతం గా ఉంది.
“సెరో సర్వేలో, మురికివాడ ప్రాంతాలలో మునిసిపల్ డిస్పెన్సరీల నుండి తీసుకున్న రక్త నమూనాలలో 41.61 శాతం సెరో పాజిటివిటీ గుర్తించాం. మొత్తంమీద, ముంబైలోని మొత్తం 24 వార్డుల పౌరుల నుండి సేకరించిన 10,197 రక్త నమూనాలలో 36.30 శాతం సెరో పాజిటివిటీ గుర్తించామని వెల్లడించారు. కస్తూర్బా హాస్పిటల్ ప్రాంగణంలోని బిఎంసి మాలిక్యులర్ బయాలజీ ప్రయోగశాలలో యాంటీబాడీస్ కోసం నమూనాలను పరీక్షించారు.