నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్

-

నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది.వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ పోస్టులు, 193 ల్యాబ్ టెక్నీషియన్‌ పోస్టులు, 31 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ చేయనుంది.

రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి వర్షాకాలం రాష్ట్రంలో డెంగీ, ఇతర విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సుల ఖాళీల తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయాలని చూస్తోంది. నియామకాల తర్వాత ఆయా పీహెచ్ సీల్లో డిమాండ్ కు అనుగుణంగా సర్జన్లను నియమిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news