ఈశాన్య భారత్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు

-

భారత్, మయన్మార్ సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మొలాజీ తెలిపింది. ప్రకంపనాలు త్రిపుర, మిజోరాం, మణిపూర్, అసోం రాష్ట్రాలను మొత్తం తాకాయి. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా వరకు భూకంప తీవ్రత నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్(ఈఎంఎస్‌సీ) వెబ్‌సైట్ తెలిపింది. ఇప్పటివరకు నేను చూసిన భూకంపాల్లో ఇదే అతి పెద్దది అన మిజోరానికి చెందిన ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌కు 143 కి.మీ. దూరంలో భూకంప కేంద్రంగా శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రవారం ఉదయం 5.15లకు భూకంపం సంభవించిందని సీస్మోలాజీ సెంటర్ తెలిపింది. ఉదయం 5.53 నిమిషాలకు రెండో భూ కంపం కూడా సంభవించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news