గ్రామాల్లో పారిశుద్ద్య నిర్వహణ నుంచి గ్రామంలోని ప్రతీ అభివ్రుద్ధి పని పంచాయతీ కార్యదర్శి చేతుల మీదిగానే జరుగుతుంది. తాగునీరు, వీధి దీపాలు, హరితహారం, పన్నుల వసూలు దగ్గర నుంచి ప్రతీ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులు నిరవేర్చాల్సిందే. ఇందులో దేనిపైనా అయినా నిర్లక్ష్యం వహిస్తే తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అవుతోంది. అయితే ఈ నిభందనలు పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులు పెడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉద్యోగం చేసేకన్నా వేరేది చూసుకోవడం బెటర్ అనే పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు.
అయితే తాజాగా తెలంగాణ సర్కార్ మరికొన్ని నిబంధనలను పంచాయతీ కార్యదర్శులకు విధించింది. రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులు ఉదయం 7గంటలకు పంచాయతీ యాప్ లో అటెండెన్స్ నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే పల్లె ప్రగతి పనులపై ప్రతీ రోజూ మూడు ఫోటోలను అప్లోడ్ చేయాలని ఆదేశించింది. కార్యదర్శులు వారికి కేటాయించిన గ్రామాల్లోనే ఉండాలిని లేకపోతే క్షమశిక్షణ, శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించింది. కాగా ఈ ఆదేశాలపై తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం మండిపడుతోంది.