టోల్ ప్లాజా దగ్గర బీభత్సం సృష్టించిన బీర్ల లోడుతో వెళ్తున్న ట్రక్

-

a truck rams into toll plaza in rajasthan Video

రాజస్థాన్‌లోని కిషన్‌ఘర్‌లో ఉన్న ఓ టోల్ ప్లాజా వద్ద ఓ ట్రక్ బీభత్సం సృష్టించింది. బీర్ల లోడుతో వెళ్తున్న ఆ ట్రక్ వేగంగా దూసుకొచ్చి టోల్ బూత్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రక్‌లో ఉన్న బీర్ల కాటన్లనీ కింద పడి చెల్లాచెదురయ్యాయి. ఆ ట్రక్ ముందు ఓ కారు టోల్ ప్లాజ్ వద్ద ఆగగా.. వెనుక నుంచి వచ్చిన ఆ ట్రక్ టోల్ బూత్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఇక.. బీర్లన్నీ నేలమట్టం అవడంతో బీర్ల కోసం అక్కడి స్థానికులు ఎగబడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news