విలన్ గా ఓకే అంటున్న బాలయ్య.. కాని..!

-

balakrishna interest to do villian roles

ఈ ఇయర్ సైమా అవార్డుల్లో బాలకృష్ణ స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకున్నారు. ఇక ఆ కార్యక్రమంలో భాగంగా మీడియాతో ముచ్చటించిన బాలకృష్ణ అది ఇది అని కాదు ఎలాంటి పాత్రనైనా చేసేందుకు తాను సిద్ధమని.. అంతేకాదు ఛాన్స్ వస్తే విలన్ గా కూడా తాను సిద్ధమే అంటున్నాడు. అయితే తనకు ప్రతినాయకుడిగా నటించాలని ఉన్నా ఫ్యాన్స్ అందుకు ఒప్పుకోరని తాను చేయట్లేదని అన్నారు.

ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నటిస్తున్న బాలకృష్ణ సినిమా మొత్తం మీద 60 గెట్టప్పులలో కనిపిస్తారని తెలుస్తుంది. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.అర సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. రానా, కళ్యాణ్ రాం, సుమంత్ నటిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఎన్.బి.కే ప్రొడక్షన్స్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ సినిమా నిర్మాణంలో కూడా బాలయ్య భాగస్వామ్యం అవుతున్నాడు. ఎన్.టి.ఆర్ సిని, రాజకీయ విషయాలతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news