రోజంతా అదే పని చేసిన యువకుడు..సీన్ కట్ చేస్తే..

-

ఇప్పుడు స్మార్ట్ యుగం నడుస్తుంది.. దాంతో ఎవ్వరూ చూసిన ఫోన్, ల్యాప్ టాప్ లను వాడుతున్నారు.. మనిషికి టాలెంట్ ఉండటం సహజం.. కొంతమందికి పుట్టుకతోనే అవి అవలంభిస్తే.. మరికొంతమందికి మధ్యలో వస్తాయి. ఇలా ఓ యువకుడికి మధ్యలో వచ్చిన ఒక అలవాటు ఏకంగా ప్రాణం మీదకు తెచ్చింది.. ఇలాంటి వాటి గురించి తప్పక తెలుసుకోవాలి..

పగలంతా ఆఫీస్ పనులతో బిజీబిజీగా గడుపుతోన్న ఓ యువకుడు.. రాత్రుళ్లు నిద్రపోకుండా అదే పని చేశాడు. ఇలా వారం రోజులు తన దినచర్య కొనసాగిన అనంతరం.. అతడికి ఊహించని పరిణామం ఎదురైంది. ఇంతకీ అసలేం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 26 ఏళ్ల యువకుడైన కావో వుహన్ నగరంలో ఉంటున్నారు. స్థానికంగా ఉన్న ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజులు బాగానే ఉంది. అయితే ఆ తర్వాతే మనోడి బిహేవియర్‌లో మార్పు వచ్చింది. ఉదయాన్నే డ్యూటీ వెళ్లి.. సాయంత్రం 6 గంటలకు తిరిగి ఇంటికొచ్చే అతను.. క్రమేపీ రాత్రి వేళల్లో నిద్రపోవడం మానేశాడు.ఆ తర్వాత నైట్ టైం అంతా కూడా ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూస్తూ తన సమయాన్ని గడిపేశాడు. ఇలా వారం రోజులు గడిచాయి.

మెల్ల మెల్లగా అతడి ముఖంలో మార్పులు రావడం మొదలయ్యాయి. పెదాలు ఒకవైపు తిరిగిపోవడం, కంటి రెప్పలు వాల్చేందుకు కూడా కష్టంగా మారడంతో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాడు. కావో ముఖానికి పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్లు అతడి ముఖానికి పక్షవాతం వచ్చినట్లు వెల్లడించారు. రాత్రుళ్లు నిద్రపోకుండా ఉండేవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారట. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూన్నారు. కొద్దిరోజుల్లో అతడి పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు.. అందుకే ఎప్పుడూ అదే పనిలో ఉండే వాళ్ళు కాస్త బ్రేక్ తీసుకోవాలి..బ్రెయిన్ కూడా పాడ్తెపోతుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version