తనని తానే పెళ్లి చేసుకున్న యువకుడు.. కారణం..!

అతడిని అతడే పెళ్లి చేసుకోవడం ఏంటి అని టైటిల్ చూడగానే ఆశ్చర్య పోయారు కదా. కానీ ఇక్కడ ఇదే జరిగింది. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో అతన్ని అతడే పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ ఒక యువకుడు. ఇక ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. బ్రెజిల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు డియాగో అనే వ్యక్తి. వైభవంగా పెళ్ళి జరిపేందుకు అంతా సిద్ధమైంది.

Are you not getting married.. follow these tips to get married easily

బంధు మిత్రులందరూ చేరుకున్నారు. ఈ క్రమంలోనే సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి కాబోయే భార్య తనకు పెళ్లి ఇష్టం లేదు అంటూ బ్రేకప్ చెప్పింది దీంతో… ఆ వ్యక్తి తనను తానే పెళ్లి చేసుకున్నాడు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనని మనం ప్రేమించుకోవడం మాత్రం ఆపకూడదు అనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ సదరు యువకుడు చెప్పుకొచ్చాడు.