అల్లు అర్జున్ బ్యాచిలర్ పార్టీ.. ఎందుకో తెలుసా..!

సాధారణంగా ఎంతో మంది హీరోలు తమ కిందిస్థాయి సిబ్బందిని కూడా తమ సొంత వారిలా చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా సొంత వాళ్ళ లాగా చూస్తూ ఎప్పుడు బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఎక్కువగా ఇలా సిబ్బందికి ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తూ తన సొంత వారిలాగా చూస్తూ ఉంటాడు. తాజాగా అల్లు అర్జున్ తన సిబ్బందిపై ఎంత ప్రేమ కనబరుస్తాడు అన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది .

అల్లు అర్జున్ అసిస్టెంట్ అభినవ్ అనే యువకుడికి ఇటీవలే పెళ్లి జరిగింది. ఇక ఈ సందర్భంగా పెళ్ళికి సర్ప్రైస్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఏకంగా … తన అసిస్టెంట్ అభినవ్ తరఫున తన సిబ్బంది అందరికీ పెద్దగా బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేశాడు. స్వయంగా అల్లు అర్జున్ తన పెళ్లికి బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఉద్యోగి అభినవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి దీనికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.