ఇష్టం లేని పెళ్లి.. యువతి ఏం చేసిందో తెలుసా..!

పెళ్లి విషయంలో ఆ తల్లిదండ్రులు చేసిన పొరపాటు ఏకంగా అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని దూరం చేసింది . ఇష్టం లేని పెళ్లి చేసుకోను అని ఎంత చెప్పినప్పటికీ తల్లిదండ్రులు వినక పోవడంతో ఇక చేసేదేమి లేక కఠిన నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకొని నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

జలగం నగర్ లో దుర్గారావు దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి పెద్ద కూతురు మాధురి ఉంది. అయితే ఇటీవలే మాధురికి పెళ్లి సంబంధం నిశ్చయించారు కుటుంబీకులు. అయితే తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం మాధురిని మందలించి మరి పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన మాధురీ కఠిన నిర్ణయం తీసుకుంటే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే సరికి ప్రాణాలు వదిలింది మాధురి. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నిండిపోయింది.