వరుడుని చంపిన వధువు కుటుంబీకులు.. ఎందుకో తెలుసా..?

ఈ మధ్యకాలంలో పరువు హత్యలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి అనే విషయం తెలిసిందే . తల్లిదండ్రులు తమకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక ఏకంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. తమకు ఇష్టం లేకుండా తమ కూతురిని పెళ్లి చేసుకున్నాడు అన్న కారణంతో ఏకంగా వరుడిని దారుణంగా హత్య చేశారు యువతి కుటుంబ సభ్యులు. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

బోయిన్ పల్లి మండలం స్తంభం పల్లిలో ఉండే గౌతమి మహేష్ అనే యువతీయువకులు ప్రేమించుకున్నారు. తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పడానికి భయపడిన ఈ ప్రేమజంట ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దసరా పండుగ రోజున ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడాన్ని యువతి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు క్రమంలోని యువకుడి కుటుంబం పై దాడి చేయగా తీవ్ర గాయాలపాలైన వరుడు చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.