ఆధార్ వున్నవాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి..!

-

మనకి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డ్ కూడా ఒకటి. ఆధార్ కి సంబంధించి మోసాలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత వివరాలు బయటకి వస్తే నష్టం కలుగుతుంది. అందుకనే నిర్లక్ష్యంగా వుండకూడదు.

దీని కోసం UIDAI కొన్ని విషయాలను చెప్పింది. వాటి కోసం ఇప్పుడు చూద్దాం. భారత పౌరుడికి తప్పనిసరిగా ఆధార్ ఉండాలి. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వాటన్నింటికీ ఆధార్ చాలా ముఖ్యం.

ఆధార్ షేర్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
ప్రతి సందర్భంలో ఎలాంటి భయం లేకుండా ఆధార్ వినియోగించవచ్చని కూడా UIDAI చెప్పింది.
పైగా ఏ సంస్థ అయినా సరే ఆధార్ కార్డు అడిగిందంటే దానికి కారణం ఉంటుందని చెప్పింది UIDAI.
అలానే మీ ఆధార్ నంబర్‌ను ఎవరికీ కూడా పంపొద్దు. ఆధార్ వినియోగించాల్సిన సమయంలో ఈ వీఐడీని ఉపయోగించచ్చు. ఆ రోజు ముగిసేసరికి VID కూడా మారుతుంది.
అలానే మీరు ఆధార్ కార్డును ఆరు నెలల కాలంలో ఎక్కడ వాడారో కూడా చూడచ్చు.
అథెంటికేషన్ మనకు ఈమెయిల్ ద్వారా తెలుస్తుంది.
ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ మీ మొబైల్ నంబర్‌కు వస్తుంది.
ఒకవేళ కనుక మీకు ఆధార్ అవసరం లేకుంటే నిర్దిష్ట సమయం ఆధార్‌ను లాక్ చేసుకోవచ్చు. కావలసినప్పుడు అన్ లాక్ చేసుకోవచ్చు.
మీ ఆధార్ ని దుర్వినియోగం చేశారేమో అనిపిస్తే 1947 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు డైల్ చెయ్యండి.
ఆధార్ సోషల్ మీడియా అకౌంట్లను చూసి ఆధార్ కార్డు అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news