కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి.. మ‌రో బుల్లి కేజ్రీవాల్ వ‌చ్చాడు.. చూశారా..?

-

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ తో ప్రమాణస్వీకారం చేయించారు. వరుసగా మూడవ సారి ఆయన ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 62 స్థానాలను గెలుచుకుని విజయ దుందుభి మోగించిన ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున అచ్చం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లా తయారై వచ్చి అందరినీ ఆకట్టుకున్న ఏడాది పిల్లాడు ఆవ్యాన్ తోమర్‌కు ఆప్ ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే.

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆ పిల్లాడిని ఆప్ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానించింది. దీంతో అతడు మరోసారి అరవింద్ కేజ్రీవాల్ కట్టుకునేట్టుగా తలకు మఫ్లర్, మెరూన్ కలర్ స్వెటర్ వేసుకుని, ఆప్ టోపీ, కళ్లద్దాలు పెట్టుకుని, మీసంతో వచ్చి అబ్బురపర్చాడు. మరోసారి అతడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చలికాలంలో కేజ్రీవాల్ ఎటువంటి దుస్తులు ధరించి కనపడతారో.. అచ్చంగా అలాగే ఈ బుల్లి కేజ్రీవాల్ రెడీ అయ్యివ‌చ్చి అంద‌రి క‌ళ్లు ఆక‌ర్షించాడు.

Read more RELATED
Recommended to you

Latest news