ఇంట్లో ఆడపిల్లలు సందడి గా తిరుగుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. వారు అటు ఇటు నడిచేటప్పుడు వారి కాళ్ళకు ఉన్న పట్టీలు ఘల్లు ఘల్లు మని చప్పుడు చేస్తుంటే వినసొంపుగా ఉంటుంది. ఆడవాళ్ళు ఒంటి నిండా ధరించడానికి వీలుగా అణువణువు ఆభరణాలు ఉన్నాయి. అలాంటి ఆభరణమే కాళ్ళకు పెట్టుకునే పట్టీలు. . పాదాలకు పట్టీలు సొగసైన అందాన్ని తెచ్చి ఆకర్షణీయంగా కనబడేలా చేస్తాయి.లయబద్దంగా అవి చేసే శబ్ధం అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదంగా చేస్తుంది.
అయితే కేవలం పట్టీలు ధరించడం వల్ల పాదాలకు అందం మాత్రమే అనుకుంటే పొరపాటే. పట్టీలను ధరించడం వెనుక ఓ శాస్త్రీయ కోణం ఉంది. ఆరోగ్య పరంగా కూడా వీటిని ధరించడం వల్ల మేలు కలుగుతుంది. అదెలాగో తెలుసుకుందాం.పట్టీలు ఎక్కువగా వెండి లేదా బంగారం తో తయారు చేస్తారు. వాటిని ధరించినప్పుడు అవి కాలిమడమలకు తాకుతూ ఉంటాయి. అలా పట్టీలు మడమలను తాకడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
అంతే కాకుండా మనం కదలిన ప్రతి సారి కాళ్ళకు ఉన్న పట్టీలు కదులుతూ శబ్దం చేస్తాయి. ఆ శబ్దం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. పట్టీలు శబ్దం పాజిటివ్ ఎనర్జీ ని ఇస్తుంది. భారతదేశంలో ఆడవారు పట్టీలు ధరించడం వల్ల దేవతలకు ఆహ్వానం పలికినట్లు అని ఒక నమ్మకం ఉంది. అలా కాళ్ళకు పట్టీలు ధరించిన వారి మహిళల ఇల్లు శుభాలతో నిండి ఉంటుంది అని నమ్మకం.ఈ మధ్య కాలంలో పంచలోహలతో కూడా పట్టీలు తయారు చేస్తున్నారు. ఇలా లోహాలు పాదాలను తాకడం వల్ల ఆ లోహల్లోని ఔషద గుణాలు శరీరానికి అంది ఎప్పుడు ఆరోగ్యం గా ఉండేందుకు సహాయపడుతుంది.