వచ్చే నెలలో ఆయుష్మాన్ భారత్ తో ఆరోగ్య శ్రీ ఒప్పందం

-

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్మాన్ భారత్ తో తెలంగాణలో వచ్చే నెలలో అనుసంధానం చేయనున్నారు. దీనికి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరగనుంది. ఆయుష్మాన్ భారత్ లో 1393 వ్యాధులకు చికిత్స అందిస్తుండగా ఈ పథకం వలన రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వందల యాభై కోట్ల దాకా కలిసి రానుంది. నిజానికి మొన్నటి దాకా కేంద్రం ప్రవేశ పెడుతున్న చాలా పథకాలు అంత బాగా లేవని, రాజకీయంగా విమర్శలు చేస్తూ వస్తున్న కేసీఆర్ ఇప్పుడు వరుసగా కేంద్ర పథకాలకు తన మద్దతు తెలుపుతూ వస్తున్నారు.

ముందు నూతన వ్యవసాయ చట్టాలకు తన మద్దతు తెలుపగా తరువాత ఆయుష్మాన్ భారత్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. భారత ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని డొవెటైల్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ బాగుంటుందని గతంలో ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీతో 80 లక్షల కుటుంబాలకు లబ్ధి పొందుతున్నారని కేంద్రం ఒత్తిడి కారణంగా ఆయుష్మాన్ భారత్ అమలు చేయబోతున్నామని ఆయన అన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news