దుర్మార్గుడైన రాజు పాలనలో పనిచేసే కంటే… వ్యవసాయ చేసుకోవడం మేలు -ఏబీ వెంకటేశ్వరరావు

-

తన సస్పెన్సన్‌ పై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే అభియోగంపై సస్పెండ్ చేస్తున్నట్టు జీవో ఇచ్చారని.. ఛార్జీ షీట్ లేదు.. ట్రయల్ లేదు అయినా నేను సాక్షులను ప్రభావితం చేయడం ఏమిటీ..? అని నిలదీశారు. ఏమీ లేని దానికి నన్ను సస్పెండ్ చేస్తూ జీవో ఇచ్చారని.. నన్ను మళ్లీ సస్పెండ్ చేయాలనే సలహా ఏ తీసేసిన తాసీల్దార్ ఇచ్చారో..? ఏ పనికి మాలిన సలహాదారు ఇచ్చారో తెలీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన జీవో లీగలుగా చెల్లుబాటు కాదని… సీఎం జగన్ మీద ఛార్జీ షీట్లు ఉన్నాయి.. కేసులు ఉన్నాయి.. అయినా సీఎంగా కొనసాగుతున్నారుగా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసులు ఎదుర్కొన్న ఐఏఎస్ శ్రీలక్ష్మీ పదవిలో కొనసాగుతున్నారని.. పదవిలో కొనసాగేందుకు ఆమెకు లేని అభ్యంతరం నాకే ఎందుకు..?అని ప్రశ్నించారు. అసలు డబ్బులు ట్రాన్సక్షన్ జరగని కేసులో అవినీతి ఏంటీ..? కొందరు ఆఫీసర్లు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది… నన్ను ప్రభుత్వం టార్గెట్ చేయడం లేదు.. కొందరు వ్యక్తులు…కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. నేను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని తగులబెట్టకుండా నేను ఆపాను… కోడి కత్తి దాడి సమయంలో గంటల్లోనే రాష్ట్రాన్ని తగులపెట్టాలని టార్గెటుగా పెట్టుకున్నారు.. దాన్ని అడ్డుకున్నానని వెల్లడించారు.

అప్పట్లో రాష్ట్రం నాశనం కాకుండా నేను అడ్డుకోవడం ఇష్టం లేని వారు ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది ఎమ్మెల్యేలు బతికే ఉన్నారు.. పార్టీని మారమని నేనేమైనా ప్రేరేపించానేమోననే విషయాన్ని వారిని అడగొచ్చుగా..?అని నిప్పులు చెరిగారు. ప్రభుత్వాన్ని కూలగొడతామని రాజ్ భవన్ గేట్ దగ్గర నేనమన్నా మాట్లాడన్నా..? అని నిలదీశారు. న్యాయపోరాటం చేస్తాను…. ఐపీఎస్ సంఘం ఎందుకు స్పందుంచడం లేదో వాళ్లనే అడగాలని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న పురుగులను ఏరివేసే వ్యవసాయం చేస్తూనే ఉన్నాను… దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసే దాని కన్నా.. వ్యవసాయం చేసుకోవడం మేలని బమ్మెర పోతన చెప్పాడని గుర్తు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news