మహిళల కోసం అభయ యాప్.. రూట్ మారినా అలెర్ట్ !

-

మహిళలు, చిన్న పిల్లల రక్షణ కోసం అభయం ప్రాజెక్ట్, అలానే అభయ యాప్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా ఆవిష్కరించారు. మహిళలు తమ మొబైల్ లో ఉన్న యాప్ ద్వారా ట్రిప్ స్టార్టింగ్, ఎండింగ్ ఫిక్స్ చేసి ఆటో లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే పోలీసులకు పూర్తి వివరాలు అందుతాయి. ఒక వేళ ఆటో రూట్ మారినా, తెలియని ప్రదేశానికి వెలుతున్నా వెంటనే ప్యాసింజర్ కు మెసేజ్ వస్తుంది. వెళుతున్న దారి తెలిసిన మార్గమైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

తెలియని మార్గం ఆటో వెళ్తుంటే ఆటోలో ఉన్న ఐఓటి డివైజ్ ను నొక్కి ప్యానిక్ అలారంను మ్రోగించవచ్చు. వెంటనే కంట్రోల్ రూమ్ లోనూ, ఆటో వద్ద అలారం రావడంతో పాటు ఆటోకు ఇంధనం నిలిచిపోతుంది. ఈ ప్రాజెక్ట్ ను తీసుకురావడం వెనుక రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు చిత్తశుద్దిని శంకించినట్లు కాదని .సిఎం జగన్ అన్నారు. వీటిని ఏర్పాటు చేయడం వలన దేశీయ ఆటోలు, ట్యాక్సీలు ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో పోటీ పడగలుగుతాయని అన్నారు. అటు ప్రయాణికులలోనూ, మన ఆటోలు, ట్యాక్సీల పట్ల నమ్మకాన్ని పెంచుకోగలుగుతామని అయన అన్నారు. ఇక ఇప్పటికే దిశా యాప్ ను పోలీస్ శాఖ సమర్ధవంతంగా నిర్వహిస్తుందన్న అయన తాజాగా తీసుకువస్తున్న అభయం ప్రాజెక్ట్, అభయం యాప్ లను రవాణా శాఖ సమర్ధవంతంగా నిర్వహిస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news