పాక్ ఆర్మీ చేతిలో మానసిక వేధింపులకు గురైన అభినందన్

-

దాదాపు 60 గంటల పాటు పాకిస్థాన్ చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ అభినందన్‌ను పాక్ నిన్న రాత్రి భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 60 గంటల పాటు పాకిస్థాన్‌లో తనకు ఎదురైన అనుభవాలను అభినందన్ ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు.

Abhinandan Varthaman Says He Was Mentally Harassed In Pakistan

అయితే.. అభినందన్‌పై పాకిస్థాన్ సైన్యం శారీరకంగా దాడి చేయకున్నా.. మానసికంగా ఆయన్ను వేధించిందట. ఇదే విషయాన్ని అభినందన్ తన పైఅధికారులకు వెల్లడించారట. ఈ విషయాన్ని న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం అభినందన్‌కు ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో మెడికల్ టెస్టులతో పాటు ఆయనకు అయిన గాయాలకు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన్ను రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news