IPL 2023 : SRH కెప్టెన్‌ గా యంగ్‌ ఓపెనర్‌ ?

-

ఐపీఎల్ 2023 మినీ వేలంకు ముం దు విలియమ్సన్, నికోలస్ పూరణ్ ను ఎస్ ఆర్ హెచ్ విడిచిపెట్టింది. వీరితో పాటు మరో పదిమంది ఆటగాళ్లను కూడా ఎస్ ఆర్ హెచ్ వేలంలో పెట్టింది. ఈ మినీ వేరంలో ఎస్ ఆర్ హెచ్ పర్సులో రూ. 42.25 కోట్లు ఉన్నా యి. ఈ వేలంలో యువ ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్టును పటిష్టం చేసుకోవాలని సన్రైజర్స్ భావిస్తోంది.

ఇక విలియమ్సన్ ను విడిచిపెట్టడంతో ఎస్ ఆర్ హెచ్ తదుపరి కెప్టెన్ ఎవరన్నది ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆ జట్టు యువ ఆటగాడు అభిషేక్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. కాగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ కు సంబంధించిన ఓ వీడియోను ఎస్ ఆర్ హెచ్ షేర్ చేయడం, ఆ వార్తలను మరింత ఊతమిస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోకు ‘వీర శూర’ క్యాప్షన్ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news