నిమ్మరసం కిడ్నీలకు మంచిదా..కాదా? తాగితే ఏం అవుతుంది?

-

మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు చాలా కన్ఫూజన్ ఉంటుంది. ఏది తినాలి, ఏది తాగాలి, వేటికి దూరంగా ఉండాలి అనే విషయంలో. ఈ క్రమంలోనే చాలామంది నిమ్మరసం తాగాలా లేదా అని తరుచుగా వైద్యులను అడుగుతుంటారు. నిమ్మకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది కాల్షియం శోషణను మెరుగుపరుస్తుంది. అయితే ఈరోజు మనం మూత్రపిండాల వ్యాధికి నిమ్మరసం మంచిదా కాదా అని తెలుసుకుందాం.

మూత్రపిండాల పని ఏంటి?

రక్తంలోని టాక్సిన్స్, వ్యర్థాలను విసర్జించే పనిని మూత్రపిండాలు నిర్వహిస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో, ఎముకల ఆరోగ్యాన్ని నియంత్రించడంలో, క్రియేటినిన్, యూరిక్ యాసిడ్ వంటి రసాయనాల స్థాయిలను నిర్వహించడంలో మూత్రపిండాలు చక్కటి పాత్ర పోషిస్తాయి.

మూత్రపిండాల వ్యాధి అంటే ఏంటి?

మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేయలేకపోవడాన్ని దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అని అంటుంటారు. అంటే టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు రక్తంలో ఉండిపోతాయి. దీనివల్ల స్ట్రోక్, గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే నిమ్మరసం తాగడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రోగులకు ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.

నిమ్మరసం క్రియాటినిన్‌ను తగ్గిస్తుందా?

నిమ్మకాయరసం క్రియేటినిన్ స్థాయిలను తగ్గించదు. కానీ క్రియోటినిన్ లెవల్స్ పెరగకుండా సాయపడుతుంది. క్రియేటినిన్ అనేది ఒక వ్యర్థ రసాయన ఉత్పత్తి, ఇది కండరాలు అరిగిపోయేలా చేసి…దెబ్బతినేలా చేస్తుందట. కండరాలు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో రక్తంలో క్రియేటినిన్ ఎక్కువగా ఉంటుంది.

కిడ్నీలు క్లియర్ చేసే క్రియాటినిన్ పరిమాణాన్ని క్రియాటినిన్ క్లియరెన్స్ అంటారు. ఆరోగ్యవంతమైన వ్యక్తిలో, క్రియేటినిన్ స్త్రీలలో నిమిషానికి 95 ml, పురుషులలో 120 ml వరకు ఉంటుంది. క్రియేటినిన్ క్లియరెన్స్ వయస్సు, పరిమాణం, మూత్రపిండాల పరిస్థితిపైనే కూడా ఆధారపడి ఉంటుంది. నిమ్మరసం క్రియాటినిన్ స్థాయిలను పెంచడం లేదా తగ్గించడం చేయదు.

నిమ్మకాయ కిడ్నీకి చెడ్డదా?

మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు నిమ్మరసం తాగటం మంచిదా కాదా అనే డైలమాలో ఉంటారు. ఎందుకంటే..ఇది ఎక్కువ తీసుకుంటేనే ఆరోగ్యానికి ప్రమాదం.. నిమ్మరసం తాగడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిగ్రస్తుల పరిస్థితి మరీ దిగజారిపోదు. అయితే ఎక్కువ తీసుకుంటే.. కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఎక్కువ నిమ్మరసం తాగితే వికారం, విరేచనాలు, వాంతులు అవుతాయి. మూత్రవిసర్జనగా కూడా పెరుగుతుంది. అంటే శరీరంలోని ద్రవాల విసర్జనను పెంచుతుంది, దీని ఫలితంగా తరచుగా వాష్ రూంకు వెళ్లాల్సి వస్తుంది.

ఎప్పుడు తాగాలి..?

నిమ్మరసం శరీరంలో ఆల్కలీన్ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. అందుకే ఉదయం పూట తాగితే చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు.
ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత మీ శరీరం డీటాక్సీఫైయింగ్ అయి ఉంటుంది. దీంతో ఆల్కలీన్ ఉన్న నిమ్మరసం తాగడం వల్ల పీహెచ్ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. నిమ్మరసాన్ని ఊరికే కాకుండా కొంచెం అల్లం, తేనెతో కలిపి తాగొచ్చు. దీంట్లోని యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయాల్ కంటెంట్‌లు మూత్రపిండాల ఆరోగ్యకరమైన పనితీరుకు పనిచేస్తాయి. అయితే గుర్తుంచుకోండి నిమ్మరసం ఎక్కువతాగితేనే సమస్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version