కేంద్రం కీలక ప్రకటన: మే 1నుంచి అందరికీ వ్యాక్సిన్

కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మే1 నుంచి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్థుతం 45 ఏళ్ళు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తుంది. మూడో విడత వ్యాక్సిన్ పై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

దేశంలో కరోనా వీర విజృంభణ చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది.