TS: హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది.ABVP మహిళా కార్యకర్తపై HYD పోలీసులు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది. వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూముల జీవో నెం.55 వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఏబీవీపీ నేతలు మద్దతిస్తూ నిరసన చేపట్టారు. ఇందులో పాల్గొన్న ఓ కార్యకర్తను బైక్ పై వెంబడించిన కానిస్టేబుళ్లు జుట్టు పట్టుకుని లాగారు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
కాగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ను నూతనంగా నిర్మించే హైకోర్టుకు ఇవ్వొద్దని స్టూడెంట్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలంలో పరిశోధనకు ఉపయోగపడే మొక్కలు ఉన్నాయని, అందువల్ల ఈ భూములను ప్రభుత్వం తీసుకొవద్దని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. జీవో నెం.55ను వ్యతిరేకిస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.