ఈఏస్ఐ స్కామ్ లో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. మాజీ డైరెక్టర్ దేవికా రాణి ,ఫార్మా సిస్ట్ నాగలక్ష్మి కి సంబంధించిన 4 కోట్ల 47 లక్షల రూపాయలు సీజ్ చేసింది ఏసీబీ. సైబరాబాద్ కమర్షియల్ రెసిడెన్షియల్ స్థలం కోసం బినామి పేర్లతో పెట్టుబడులు పెట్టిన మాజీ డైరెక్టర్ దేవికా రాణీపై దృష్టి పెట్టారు. అరెస్ట్ కు ముందు పెద్ద మొత్తం లో బిల్డర్ కు చెల్లించింది. నిన్న బిల్డర్ దగ్గర 4 కోట్ల 47 లక్షల రూపాయలు సీజ్ చేసింది ఏసీబీ.
ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుండి తీసుకొచ్చింది అన్న కోణం లో విచారిస్తున్న ఏసీబీ… త్వరలో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దేవికారాని ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఏసీబీ… దేవికారాని, నాగలక్ష్మి తో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తుంది.