పద్మావతి వర్సెస్ శ్రావణి..హోరాహోరీ.!

-

రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అలాంటి వాటిలోని ఒకటి శింగనమల నియోజకవర్గం. శింగనమల నియోజకవర్గం లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుందని అక్కడి ప్రజలు, రాజకీయ నాయకుల సెంటిమెంట్.

శింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం 2014లో వైసీపీ తరఫున జొన్నలగడ్డ పద్మావతి పోటీ చేసి యామిని బాల చేతిలో ఓటమి పొందారు. ఆ తర్వాత నియోజకవర్గం లో పాదయాత్ర చేసి ప్రజలకు సేవ చేసి, ప్రజల అవసరాలను గుర్తించి వాటిని నెరవేరుస్తూ నియోజకవర్గంలో జొన్నలగడ్డ పద్మావతి గట్టి పట్టు సంపాదించుకున్నారు.

 

2019 ఎన్నికలలో టి‌డి‌పి అభ్యర్ధి బండారు శ్రావణి పై అత్యధిక ఓట్ల మెజారిటీతో జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ నుంచి గెలిచారు. జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి వైయస్ జగన్ కు సన్నిహితుడని ఎమ్మెల్యే పేరు చెప్పి భర్త కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు.

జొన్నలగడ్డ పద్మావతి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఈసారి కూడా మళ్లీ తననే గెలిపిస్తున్నాయని ధీమాతో ఉన్నారు.  వైసీపీలో పద్మావతికి వ్యతిరేక వర్గం లేదు అని కాదు కానీ అక్కడ పోటీ చేయడానికి పద్మావతి తప్ప మరొకరు లేరు. అందువలన శింగనమలలో వైసీపీలో వర్గపోరు లేదని చెప్పవచ్చు.

టిడిపి తరఫున ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బండారు శ్రావణిని ప్రకటించే అవకాశం ఉంది అని అంటున్నారు. బండారు శ్రావణి జెసి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. టిడిపిలో వర్గపోరు ఉన్నప్పటికీ బండారు శ్రావణి 2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గం లో పట్టు సాధించింది .అధిష్టానం కనుక ఈసారి శింగనమల వర్గ పోరును అదుపులో ఉంచితే జొన్నలగడ్డ పద్మావతికి బండారు శ్రావణి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఏదిఏమైనా రాబోయే ఎన్నికలు జొన్నలగడ్డ పద్మావతి,  బండారు శ్రావణి మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news