చంద్రబాబు లాయర్లపై ఏసీబీ న్యాయమూర్తి సీరియస్‌

-

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, ఆయను ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఆయన తరపు న్యాయవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. కోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.. తాజాగా ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున మరో పిటిషన్ దాఖలైంది.. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించటానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు.. సీఐడీ కార్యాలయంలో ఉన్న కేసు అన్ని పత్రాలు పరిశీలన కోసం అనుమతి కోరారు.. 207 సిఆర్పీసీ కింద పిటిషన్ వేశారు న్యాయవాదులు.. దీనిపై వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ లూథ్రా.

అబ్జెక్షన్ యువరానర్... లాయర్ సిద్ధార్థ్ లూథ్రా! | lawyer sidharth luthra  arguments for tdp chief chandrababu - Telugu Oneindia

అయితే దీని పై చంద్రబాబు తరపు లాయర్లపై విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డర్స్ సమయానికి కొత్త పిటిషన్లు వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కోర్టు ప్రొసీజర్స్ ఫాలో అవ్వడం లేదని అన్నారు. పిటిషన్ వేయాలంటే మధ్యాహ్నం గంటలలోపు వేయాలని అన్నారు. నేరుగా పిటిషన్ వేసి వాదనలు వినాలని అనడం సరికాదని జడ్జి వ్యాఖ్యానించారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున మరో పిటిషన్ దాఖలు కావడంతో న్యాయమూర్తి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి డాక్యుమెంట్ల పరిశీలనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. సెక్షన్ 207 సీఆర్పీసీ కింద అనుమతి ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. అయితే ఇలా వరుస పిటిషన్లు వేయడంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చేస్తే విధులు ఎలా నిర్వహిస్తామని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news