చంద్రబాబు అరెస్ట్.. బీజేపీ సమర్థించదు : ఎంపీ లక్ష్మణ్‌

-

ఆంధ్రప్రదేశ్​లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్​ సబబు కాదని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ ఈ అరెస్టును తప్పుబడుతోందని తెలిపారు. ఆయనను ఎలాంటి వివరణ లేకుండా అరెస్టు చేశారని గుర్తు చేశారు. ఎఫ్​ఐఆర్​లో పేరు చేర్చలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు జరిపేందుకు సన్నాహాలు వేగంగా చేస్తోందని తెలిపారు. మాజీ రాష్ట్రపతి నివేదిక వచ్చిన అనంతరం.. పార్లమెంట్​లో బిల్లు పెట్టి అందరి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

BJP MP Laxman: బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారింది.. సిట్ విచారణపై  నమ్మకం లేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ - 10TV Telugu

చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో శనివారం ఉదయం అరెస్ట్​ చేశారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్​ జైలుకి పోలీసులు తరలించారు. మరోవైపు, చంద్రబాబు హౌస్ రిమాండ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ పూర్తయింది. హౌస్ రిమాండ్ కంటే చంద్రబాబుకు రాజమండ్రి కేంద్రకారాగారంలోనే భద్రత ఉంటుందని సీఐడీ వాదనలు వినిపించింది. ఈ క్రమంలో కేంద్రకారాగారంలో భద్రతపై మరింత వివరణ కావాలని చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అడిగారు. చంద్రబాబుకు ముప్పు విషయంలో సంబంధిత అంశాలను లూథ్రా… న్యాయమూర్తికి వివరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news