రాహుల్, కోహ్లీ సెంచరీలు… పాకిస్తాన్ కు చెమటలు పట్టించిన ఇండియా !

-

ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన ఈ రోజు కొలంబో లోని ప్రేమదాస స్టేడియం లో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుని ఎంత తప్పు చేసిందో ఇండియా బ్యాటింగ్ ను చూస్తే అర్ధం అవుతుంది. ముందుగా ఓపెనర్లు రోహిత్ శర్మ (54) మరియు శుబ్మాన్ గిల్ (58) లు అర్ద సెంచరీ లతో రాణించి , ఏ బౌలర్లు అయితే ఆవేశంతో ఓవర్ కాంఫిడెన్స్ చూపించారో వారిని ఉతికి ఆరేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ మరియు కోహ్లీ లు పాకిస్తాన్ బౌలర్లలపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ మూడవ వికెట్ కు అత్యధికంగా 223 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొదటగా చాలా నెమ్మదిగా మొదలెట్టిన రాహుల్ మరియు కోహ్లీ లు కుదురుకున్నాక పాకిస్తాన్ బౌలర్లపై రెచ్చిపోయి ఆడారు. వీరిద్దరూ సెంచరీ లతో చెలరేగి ఇండియా దెబ్బ ఏమిటో మరోసారి పాకిస్తాన్ కు రుచి చూపించారు. కోహ్లీ (122) వన్ డే లలో 47వ సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు.. ఇక ఓవరాల్ గా 77 సెంచరీ లను పూర్తి చేసుకోగా… సచిన్ టెండూల్కర్ వన్ డే సెంచరీ లకు మరో రెండు సెంచరీ ల దూరంలో మాత్రమే ఉన్నాడు.

ఇక రాహుల్ (111) సైతం గాయం తర్వాత ఆడిన మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసి మరోసారి టీం కు ఎంత అవసరమో తెలియచేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news