ఉద్యోగులకు షాక్​.. 19వేల మందిపై యాక్సెంచర్ వేటు!

-

ఐటీ ఉద్యోగులపై లేఆఫ్స్ పిడుగు ఇంకా పడుతూనే ఉంది. ఇప్పటికే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విటర్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు భారీస్థాయిలో లేఆఫ్స్ ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో యాక్సెంచర్ కూడా చేరింది. ఏకంగా 19వేల ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వార్షిక ఆదాయ వృద్ధిరేటు, లాభాల అంచనాలను కూడా స్వల్పంగా తగ్గించిన్నట్లు పేర్కొంది. భారత్‌లో ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నది కంపెనీ ప్రకటించలేదు.

ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం సాంకేతిక పరమైన పెట్టుబడుల నియంత్రణలో భాగంగానే ఈ లేఆఫ్స్ ప్రకటించినట్లు యాక్సెంచర్​ తెలిపింది. ఈ భారీ తొలగింపులతో సంస్థ వార్షిక ఆదాయ వృద్ధి, లాభాల అంచనాలు కూడా తగ్గనున్నాయని వెల్లడించింది. ఈ నిర్ణయంతో కంపెనీలోని నగదు రహిత కార్యాకలాపాల ఉద్యోగులపై ప్రభావం పడనుందని రాయిటర్స్​ నివేదించింది. 19 వేల ఉద్యోగుల తొలగింపు కారణంగా సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 2.5 శాతం మంది ఉపాధి కోల్పోనున్నారని రాయిటర్స్​ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news