మందమర్రి కేకే-5 గనిలో ప్రమాదం..కార్మికుడు మృతి!

-

మందమర్రి కేకే-5 గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కార్మికుడు మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకివెళితే..మోకిన పల్లి లక్ష్మణ్ (49)అనే సింగరేణి కార్మికుడు కేకే-5 గని రెండో బదిలీ కోల్ కట్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.డ్యూటీ అనంతరం గని నుంచి బయటికి వస్తుండగా అస్వస్థతకు గురై మ్యాన్ రైడింగ్ నుంచి జారిపడ్డాడు. గమనించిన తోటి కార్మికులు లక్ష్మణ్‌ను పైకి తీసుకొచ్చే క్రమంలో సరైన స్ట్రెచర్ అందుబాటులో లేదు.దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.

Suspicious death of a 5th class student in the hostel of Gurukula School

మృతుడు లక్ష్మణ్ నివాసం శ్రీపతి‌నగర్ కాగా అతడికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా సమాచారం.ప్రమాద ఘటనను తెలుసుకున్న కార్మిక నేతలు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి వెళ్లారు.మరణించిన లక్ష్మణ్ కుటుంబానికి న్యాయం చేయాలని సింగరేణి గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, భీమనాధుని సుదర్శన్, ఐ‌ఎన్‌టీ‌యూసీ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య,కేంద్ర కమిటీ నాయకులు కాంపల్లి సమ్మయ్య డిమాండ్ చేశారు.కార్మికుల రక్షణ, సంక్షేమానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే సింగరేణి యాజమాన్యం కేకే-5 గనిలో స్ట్రెచర్ లేకపోవడం‌పై ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news