వాస్తు ( Vasthu ) శాస్త్రంలో పడకగది ఏ వైపున ఉండాలనే దానిపై చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. పడక గది ఒక నిర్దిష్టమైన వైపు ఉంటే అన్ని విషయాలకు మంచిది. లేదంటే ప్రతికూల ప్రభావాలు కలిగి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల మీరు పడుకునే పడక గది వాస్తు ప్రకారం సరైన దిశలో ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా నైరుతి వైపు పడకగది ఉంటే అన్నింటికీ మంచిది. ఈశాన్యంలో మాత్రం అస్సలు ఉండకూడదు. అది ఎవ్వరికీ మంచిది కాదు.
నైరుతి దిక్కున పడకగది ఉండడం వల్ల మానసికంగా బలం చేకూరుతుంది. అలాగే పడుకునేటపుడు తల దక్షిణం వైపు ఉండేలా చూసుకోండి. దానివల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఇంకా బెడ్ పై బట్టలను ఇష్టం ఉన్నట్టుగా పడవేయకూడదు. చిందర వందరగా ఉన్న బెడ్ రూమ్ ఖంగాళీగా మారిన మనసును సూచిస్తుంది. దుప్పట్లు, రగ్గులు, దిండ్లు మొదలగునవి ఒక పద్దతి ప్రకారం ఉంచుకోవాలి. ఇష్టం ఉన్నట్టుగా విసిరివేయడం మానసికంగా ప్రతికూల ప్రభావాన్ని తీసుకువస్తుంది.
అంతేకాదు బెడ్ రూమ్ లో బాత్రూమ్ ఉన్నట్లయితే ఆ బాత్రూమ్ కి ఎదురుగా బెడ్ ని ఉంచవద్దు. అది అస్సలు కరెక్ట్ కాదు. దానివల్ల దుర్భల పరిస్థితులు ఏర్పడతాయి. నెగెటివ్ ఎనర్జీ పెరిగి మానసికంగా కలతలను తీసుకువస్తుంది. అందుకే, బాత్రూమ్ తలుపుకి ఎదురుగా బెడ్ ఉంచరాదు. శుభ్రంగా ఉన్న పడకగది ఆనందాలను అందిస్తుంది. అలాగే మీ భాగస్వామితో సరైన సంబంధాన్ని ఉంచుతుంది. ఆ బంధం గట్టి పడి దృఢంగా ఉంటుంది. వాస్త్రు ప్రకారం చెప్పిన పై విషయాలు నమ్మకానికి సంబంధించినవి మాత్రమే.