వ్యాక్సినేషన్ లో దూకుడు.. 66కోట్ల డోసులకు ఆర్డర్.

-

భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. ఇప్పటికే 7కోట్ల మందికి పైగా రెండు డోసులు పడ్డాయి. మొత్తం 40కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తయ్యాయి. 18పైబడ్డ ఏళ్లలోపు వారందరికీ కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న ప్రభుత్వం, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగం చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మరో 66కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ పెట్టింది. ఇందుకోసం 14వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలనీ, వ్యాక్సినేషన్ కార్యక్రమం తొందరగా పూర్తవ్వాలని, థర్డ్ వేవ్ ని తట్టుకోవాలంటే వ్యాక్సిన్ ఒకటే మందు అని తెలిపింది.

అందుకే రోజువారి వ్యాక్సినేషన్ వేగం బాగా పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే 40లక్షల డోసుల కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఇదిలా ఉంటే వేగంగా విస్తరించే డెల్టా వేరియంట్ పట్ల ప్రతీ ఒక్కరికీ ఆందోళన ఉంది. డెల్టా, డెల్టా ప్లస్ కారణంగానే మూడవ వేవ్ వస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నవారికి 95శాతం రక్షణ ఉంటుందని, డెల్టా వేరియంట్ పై అది పోరాడుతుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news