ఏజెంట్ ఆత్రేయ తమిళ రీమేక్.. హీరీ హీరోయిన్లు ఫిక్స్..

-

నవీన్ పోలిశెట్టి హీరోగా పరిచయకైన ఏజెంట్ ఆత్రేయ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ థ్రిల్లర్ సినిమాకి ప్రేక్షకుల రెస్పాన్స్ బాగానే వచ్చింది. 2019లో వచ్చిన ఈ చిత్రం బెస్ట్ థ్రిల్లర్ జాబితాలో చేరింది. హీరోగా నవీన్ పోలిశెట్టికి మంచి సినిమా అయ్యింది. స్వరూప్ ఆర్ ఎస్ జే దర్శకత్వం వహించిన ఈ సినిమాని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఐతే తాజాగా ఈ సినిమా తమిళంలో రీమేక్ కి వెళ్ళింది.

తమిళ రీమేక్ లో హీరోగా ఫేమస్ కమెడియన్ సంతానం ఫిక్స్ అయ్యాడని సమాచారం. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికీ పరిచయమైన సంతానంకి తమిళంలో మంచి ఫాలోయింది. అటు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే హీరోగా దర్శనం ఇస్తుంటాడు. హీరోయిన్ గా సీరు అండ్ మజ్ను ఫేమ్ రియు సుమన్ ఎంపికైందని తెలుస్తుంది.. వంజగర్ ఉలగమ్ సినిమాకి విమర్శకుల ప్రశంసలు పొందిన మనోజ్ బీద తమిళ రీమేక్ కి దర్శకత్వం వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news