తల్లి శవాన్ని పది సంవత్సరాల నుండి ఫ్రీజర్ లో దాచి పెట్టారు. దీనిని చూస్తే షాక్ అవుతారు. వివరాల లోకి వెళితే ఈ ఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. తన తల్లి శవాన్ని 10 ఏళ్ల పాటు ఫ్రీజర్ లో దాచి పెట్టింది. ఇది తాజాగా వెలుగు లోకి వచ్చింది. ఓ అపార్ట్మెంట్ లో 48 ఏళ్ల యుమి యోషినో అనే మహిళ మున్సిపల్ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఓ అపార్ట్మెంట్ లో తల్లి తో కలిసి నివసిస్తుంది.
అయితే ఆ అపార్ట్మెంట్ యజమాని అద్దె అడిగినా ఇవ్వలేదు. ఎంత చెప్పినా ఇంటిని వదిలి వెళ్ళక పోవడం తో పోలీసులకి ఫిర్యాదు చేసారు. ఇలా ఈ ఘటన బయట పడింది. తన తల్లి చనిపోయాక ఆమెను విడిచి ఉండలేక ఇలా తనతోనే అపార్ట్మెంట్ లో ఉంచుకున్నానని యోషినో చెప్పింది.
ఇలా ఆమె తల్లి శవాన్ని గత పదేళ్లుగా ఫ్రీజర్ లోనే దాచి ఉంచినట్లు పోలీసులు విచారించి ఈ సమాచారాన్ని అందించారు. మహిళ చనిపోయే నాటికి ఆమె వయసు 60 ఏళ్ళు. కానీ ఈమె చనిపోవడానికి కారణాలు, చనిపోయిన విధానం పోస్టుమార్టం లో తేలలేదు అని పోలీసులు చెప్పారు.