ఓ చేత్తో ఇచ్చి.. మరో చేత్తో తీసుకుంటున్నారు.. జగన్ భలే ప్లాన్..?

ఇటీవలే ట్రాఫిక్ జరిమానాలు విషయంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ జరిమానాలు అమాంతం పెంచేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుత వాహనదారులు అందరూ గగ్గోలు పెడుతున్నారు. ఏ చిన్న ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన జేబులకు చిల్లులు పడే పరిస్థితి ఏర్పడింది. అయితే జగన్ సర్కార్ అమలులోకి తెచ్చిన నిబంధనలపై ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ క్రమంలోనే టిడిపి పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు జగన్ సర్కార్ తీసుకొచ్చిన నూతన ట్రాఫిక్ జరిమానాలు పై స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ఓవైపు జగన్మోహన్ రెడ్డి సర్కార్ వాహనమిత్ర అనే పథకం ద్వారా వాహనదారులకు చేయూతనిస్తున్నాము అని చెబుతూనే మరోవైపు భారీ జరిమానా ద్వారా ఇచ్చిన మొత్తాన్ని మళ్లీ తీసుకుంటుందని… ఇలా ఓ చేత్తో ఇస్తూ మరో చేత్తో తీసుకుంటున్న జగన్… ప్రజలకు అర్థమవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రహదారి కూడా వేయించ లేదు కానీ జరిమానాలు మాత్రం భారీగా విధించారు అంటూ ఎద్దేవా చేశారు అచ్చన్నాయుడు.