ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్..

తెలంగాణలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల ముచ్చెమటలు పట్టిస్తుంటే..ప్రభుత్వ అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు..మల్కాజ్‌గిరి ఏసీపీ,కీసర ఎమ్మార్వో నాగరాజు ఉదంతం మరువక ముందే మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు..

ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 1.65 లక్షలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు..ఓ పనికి సంబంధించి బిల్లులు చెల్లించేందుకు గాను కాంట్రాక్టర్ నుంచి కమిషనర్ సురేందర్ రూ. 11 లక్షలు లంచం డిమాండ్ చేయగా..ఇవాళ రూ. 1.65 లక్షలు లంచంగా ఇస్తుండగా మాటు వేసి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు..కాగా హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టులో కమిషనర్‌ను శుక్రవారం ప్రవేశ పెటనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.