చైనా కు భారీ షాక్ ఇచ్చిన బ్రెజిల్..?

-

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పట్టి పీడిస్తున్న తరుణంలో ప్రస్తుతం వివిధ దేశాల్లో వ్యాక్సిన్ అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఎవరూ ఊహించని విధంగా చైనా తమ దేశంలో వ్యాక్సిన్ రెడీ అయ్యిందని ప్రకటించింది. ఈ క్రమంలోని పలు దేశాలు చైనా వ్యాక్సిన్ సంబంధించిన కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధం అయ్యాయి. ఇలా చైనా వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైన దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే.

కానీ ఇప్పుడు బ్రెజిల్ తమ నిర్ణయాన్ని మార్చుకుని చైనాకు సంబంధించిన వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో చైనా కు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి . చైనా కు సంబంధించిన ఫినోవిక్ వ్యాక్సిన్ ను కొనుగోలు చేయబోమని ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. చైనా వ్యాక్సిన్ కొనవద్దు అంటూ దేశ పౌరుల నుంచి పలు విన్నపాలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొందని స్పష్టం చేశారు బ్రెజిల్ అధ్యక్షుడు.

Read more RELATED
Recommended to you

Latest news