మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆచార్య అప్డేట్ వచ్చేసింది

-

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు చిరంజీవి. మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య షూటింగ్ మళ్ళీ మొదలు కాబోతోందని ఈ రోజు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సోమవారం నుండి అంటే తొమ్మిదో తారీఖు నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు ప్రకటించారు. అలానే ఇది ఒక లాంగ్ భారీ షెడ్యూల్ గా ఉంటుందని కొణిదెల ప్రొడక్షన్స్ ప్రకటించింది.

అలానే సినిమాని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేస్తున్నట్టు కూడా హింట్ ఇచ్చారు మేకర్స్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. తిరు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ ఉండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news