అర్నబ్ కి అండగా కేంద్ర మంత్రి…!

రిపబ్లిక్ ఛానల్ అధినేత అర్నబ్ గోస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అతని విషయంలో ముంబై పోలీసులు కాస్త సీరియస్ గా ఇబ్బందిగా వ్యవహరించారు అనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తన మీద దాడి చేసారు అని అర్నబ్ గోస్వామి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇక అతనికి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అండగా నిలిచారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడిని మేము ఖండిస్తున్నాము అని అన్నారు.

ప్రెస్ ని ట్రీట్ చేసే విధానం ఇది కాదు అని ఆయన అన్నారు. మీడియా విషయంలో ఇలా ప్రవర్తించడం అత్యవసర రోజులను గుర్తు చేస్తుంది అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. కాగా అతన్ని నేడు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018 కేసులో అదుపులోకి తీసుకున్నారు.