అచ్చన్న ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?

-

ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన ఏపీ టీడీపీ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడును ఎన్నో పరిణామాల తర్వాత అర్ధరాత్రి దాటాక విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. అయితే అక్కడి నుంచి తిరిగి న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడుకు రెండు వారాలపాటు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. కాగా కోర్టుకు హాజరు పరచడానికి ముందు అచ్చెన్నాయుడును ఈఎస్‌ఐ ఆసుపత్రి క్యాజువాలిటీకి తీసుకువచ్చారు. అక్కడ ఆర్‌ఎంఓ డాక్టర్‌ శోభ పర్యవేక్షణలో వైద్యులు ఆయనకు బీపీ, సుగర్‌ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా టెస్ట్‌ కోసం స్వాబ్‌ సేకరించారు.

అయితే ఈ రోజు ఉదయం అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు! మీడియాలో వస్తున్న వార్తలు చూసి అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై ఏసీబీ అధికారులతో సీఎం జగన్ మాట్లాడి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అచ్చెన్నాయుడు కోరుకున్న చోట వైద్య సహాయం అందించాలని అధికారులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో తాజాగా అచ్చెన్నాయుడి హెల్త్ బులెటిన్‌ విడుదలైంది. అచ్చెన్నాయుడు సుదీర్ఘ ప్రయాణం చేయడంతో గత ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. ఆ గాయానికి చికిత్స అందిస్తున్నామన్నారు. గాయం తగ్గడానికి రెండుమూడు రోజులు పట్టొచ్చని, బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామని, షుగర్ నార్మల్ గానే ఉందని డాక్టర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news