ఈఎస్ ఐ అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడుకి కాలం కలిసిరావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సరిగ్గా అరెస్టుకు ఒక రోజు ముందే ఆయన ఆపరేషన్ చేయించుకోవడం ఏమిటో.. అనంతరం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడం ఏమిటో.. హాస్పటల్ లో కరోనా పేరుచెప్పి ఎవరినీ కలవలేని పరిస్థితి కలగడం ఏమిటో.. అనుకుంటున్న దశలో కాస్త ఫ్రీడం దొరికే అవకాశం దొరికింది అచ్చెన్నకు!
అవును.. అచ్చెన్నాయుడు తన ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని, కోర్టు అనుమతిస్తే తన సొంత ఖర్చులతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ చేయించుకుంటానని తెలపడం.. అందుకు కోర్టు అనుమతి ఇవ్వడం తెలిసిందే! ఈ క్రమంలో గుడ్ టైం స్టార్ట్ అయ్యిందేమోనని భావించిన అచ్చెన్నా.. ఇదే ఊపులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు! అచ్చెన్న బయటకు వస్తే సాక్ష్యులను తారుమారు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వ తరుపు న్యాయవాదులు వాదన వినిపించారు! ఫలితంగా అది కాస్తా ఆగింది. అయినా మరోసారి అచ్చెన్న ఆ ప్రయత్నం స్టార్ట్ చేశారు!
ఈ క్రమంలో ప్రస్తుతం అచ్చెన్న తరుపు వాదనలు విన్న కోర్టు… ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదనలు సోమవారం వింటామని, అనంతరం అచ్చెన్న బెయిల్ పై స్పందిస్తామని తెలిపింది! అంతవరకూ బాగానే ఉంది.. అన్నీ అనుకూలంగా జరిగితే సోమవారం బెయిల్ కూడా రావొచ్చని అంతా భావించి ఉండొచ్చు కానీ… ఈ లోపు పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట్ అజ్ఞాతంలోకి వెళ్లడమే ఇప్పుడు పెద్ద సమస్య అయ్యిందని కామెంట్లు వినిపిస్తున్నాయి!
నోటిదాకా వచ్చిన కూడు నేలపాలు అయ్యిందన్నట్లుగా.. అచ్చెన్న బెయిల్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సమయంలో… మాజీ మంత్రి పితాని పీఎస్ అరెస్టయిన అనంతరం పితాని కుమారుడు అజ్ఞాతంలోకి వెళ్లడం.. అంతకంటే ముందే ముందస్తు బెయిల్ కు అప్లై చేయడం తెలిసిందే. దీంతో… ఈ సమయంలో అచ్చెన్నకు బెయిల్ ఇవ్వడం ఏమాత్రం బావ్యం కాదనే దిశగా ప్రభుత్వ వాదనలు ఉండోచ్చని అంటున్నారు!! సో… పితాని పుత్రరత్నం ముందస్తు జాగ్రత్తలు అచ్చెన్న కొంపముంచాయని అంటున్నారు విశ్లేషకులు!