బాబుకు బెయిలు రావడం వైసీపీ నేతలకు ఒప్పడం లేదు: అచ్చెన్నాయుడు

-

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలుపు సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలు, నేతలు మరియు అధిష్టానం చాలా కృషి చేస్తోంది. అందులో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరు మీద చేస్తున్న కార్యక్రమాలపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రజల నుండి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారంటూ నిన్న విజయసాయి రెడ్డి కూడా రెచ్చిపోయి మాట్లాడారు. దీనికి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, టీడీపీ చెబుతున్న పథకాలకు ప్రజల్లో వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేని వైసీపీ నేతలు కావాలనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజల నుండి మేము ఎక్కడా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం లేదని క్లారిటీ ఇచ్చారు అచ్చెన్నాయుడు. చంద్రబాబుకు బెయిల్ రావడంతో జీర్ణించుకోలేని వైసీపీ మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది అంటూ అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.

- Advertisement -

రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ చంద్రబాబు అఖండ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని ధీమాను వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...