ప్రధాన రహదరిపై యాసిడ్​ ట్యాంకర్​ లీకేజీ… భయంతో వణుకుతున్న ప్రజలు

-

మధ్యప్రదేశ్​ రత్లాంలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని బైపాస్​ మార్గంలో ఓ యాసిడ్​ ట్యాంకర్​ లీకేజీకి గురైంది. ఆ ప్రాంతం మొత్తం తెల్లటి పొగతో నిండిపోయింది. దీంతో పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.క్లోరోసల్ఫోరిక్​ యాసిడ్​ నింపుకొని నగ్దా నుంచి గుజరాత్​లోని అహ్మదాబాద్​ వైపునకు ట్యాంకర్ వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.

md
md

రత్లాంలోని బైపాస్​ రోడ్డులో లీకేజీ కాగా.. భారీగా తెల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. లీకేజీని గుర్తించిన డ్రైవర్​ వెంటనే లారీని ప్రధాన రహదారి నుంచి పక్క దారిలోకి తీసుకెళ్లి నిలిపేశాడు.ఆ తర్వాత అహ్మదాబాద్​ డ్రెస్సింగ్​ కంపెనీకి చెందిన సిబ్బంది, సంఘటనాస్థలానికి చేరుకుని యాసిడ్​ను మరో ట్యాంకర్​లోకి మార్చారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవటం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి విపత్కర ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు స్థానిక ప్రజలు, రహదారులకు ఇరువైపులా ఉన్న కుటుంబాలు భయబ్రాంతులకు గురవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news