ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు కూడా సరిగా ఆకలి లేదు, తినాలని పించటం లేదు. అని ప్రతి ఇంట్లో రోజూ ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడంమే. దీని కోసం ఆసుపత్రి ల్లో ఇచ్చే మందులు వేసుకోవడం వల్ల లేని పోని అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. అసిడిటీ, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వస్తున్నాయి.
ఈ సమస్యకు పరిష్కారం మన చేతుల్లోనే మన వంటింట్లోనే ఉంది.రోజూ నాలుగు ఖర్జూరం పండ్లు తినడం లేదా ఖర్జూరం రసం తాగినా మంచి ఫలతాన్నిస్తుంది.మెంతులు ఇవి పొట్టలో ఉన్న గ్యాస్ ని తరిమి కొడుతుంది. మెంతులు పెరుగులో పన్నెండు గంటలు నానపెట్టి తీసుకోవాలి.
కలబంద గుజ్జు ప్రతి రోజూ ఒక స్పూను తీసుకోవడం వల్ల అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.వాము, శొంఠి, మిరియాలు, జీల కర్ర ఈ నాలుగు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ప్రతి రోజూ భోజనానికి ముందు మొదటి ముద్దలో కొంచెం ఈ పొడి, నెయ్యి కలిపి తింటే ఎటువంటి జీర్ణ సంబందమైన సమస్యలైన మటు మాయం అవుతాయి.