ఓటిటి కి ఫిక్స్ అయిన యాక్షన్ హీరో.. దసరాకి బరిలోకి..?

-

టాలీవుడ్ లో విలన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత యాక్షన్ హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు గోపిచంద్. అయితే ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఆరడుగుల బుల్లెట్టు సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడో ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటిటి లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయట. చర్చలు పూర్తవ్వగానే దసరాకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారట చిత్రబృంధం. ఇప్పటికే దసరాకి విడుదలయ్యేందుకు పలు సినిమాలు సిద్ధంగా ఉండగా గోపీచంద్ కూడా దసరా బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version