ప్రముఖ నటుడు సచిన్ జోషిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..గుట్కా అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యారు..ముంబై ఏయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని దుబాయ్ వెళ్లే ప్రయత్నంలో అదుపులోకి తీసుకున్నారు.. హైదరాబాద్‌లో దొరికిన గుట్కా అక్రమ రవాణా కేసులో అతడిని ఇమిగ్రేషన్ అధికారులు దుబాయ్ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు..ముంబై వెళ్లిన ప్రత్యేక బృందం సచిన్‌ను హైదరాబాద్ తీసుకొని వచ్చి గుట్కా కేసులో ప్రశ్నించింది. అతనికి సీఆర్‌పీసీ 41కింద నోటీసులు ఇచ్చి బెయిల్‌పై వదిలిపెట్టారు. గత మార్చినెలలో హైదరాబాద్‌లో భారీగా గుట్కా పట్టుకున్నారు. 80బాక్సుల్లో గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ప్రశ్నించగా సచిన్ జోషీ పేరు తెరపైకి వచ్చింది. దీంతో బహదూర్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ.. 336, 273 సెక్షన కింద కేసులు పెట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అవసరమైతే మరోసారి ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు.