ఆసియాలోనే అతి పొడవైన టన్నెల్ పనులు మొదలు పెడుతున్న కేంద్రం…!

-

శ్రీనగర్ మరియు లేహ్ మధ్య అన్ని వాతావరణ పరిస్థితుల్లో రవాణాకు ఉపయోగపడే జోజిలా టన్నెల్ పనులను రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారంభిస్తారు. 14.15 కిలోమీటర్ల ఆసియాలో పొడవైన టన్నెల్ గా ఇది నిలుస్తుంది. 2004-05లో దీనిని నిర్మించడానికి ప్రణాలికలు సిద్దం చేసారు. జోజిలా పాస్ 11,578 అడుగుల ఎత్తులో ఉన్నందున ఈ ప్రాజెక్ట్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

శీతాకాలంలో, భారీ హిమపాతం కారణంగా దీన్ని మూసి వేస్తారు. జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ యొక్క సమగ్ర ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక-సాంస్కృతిక సమైక్యతను పెంచడానికి ఈ ప్రాజెక్ట్ ని రెడీ చేసారు. జూలై 2016 లో నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) కు నిర్మాణం కోసం అప్పగించింది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Exit mobile version