కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎవరికి వారుగా ముందుకి వస్తున్నారు. వైద్యులు అయితే ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కరోనా వైరస్ ఉందని తెలిసినా, అది ప్రాణాల మీదకు తెస్తుందని తెలిసినా సరే ఎవరికి వారుగా ముందుకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం ఇక ఇప్పుడు సామాన్యులు కూడా ముందుకి వస్తున్నారు. తమ వంతుగా ఎవరి సహాయ౦ వారు చేస్తున్నారు ఇప్పుడు.
తాజాగా ఒక నటి… నర్సుగా మారి సేవ చేయడానికి ముందుకి వచ్చింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సినిమా ఫ్యాన్‌లో కనిపించిన నటి షికా మల్హోత్రా, ఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ, సఫ్దర్‌గంజ్ హాస్పిటల్‌లో నర్సింగ్ డిగ్రీ చేసింది. దీనితో ఆమె నర్సుగా అర్హత సాధించింది. దేశంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పుడు డాక్టర్లు, నర్సుల కొరత ఉంది.
దీనితో ఆమె ముందుకి వచ్చింది. తాను మహారాష్ట్రలో నర్సుగా పని చేస్తాను అని చెప్పింది. అందరూ ముందుకి రావాలని విజ్ఞప్తి చేసింది. ప్రజల బ్లెస్సింగ్స్ తనకు కావాలని ఆమె పేర్కొంది. ప్రజలు అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని ఆమె కోరింది. అందరూ అన్ని ఆరోగ్య జాగ్రత్తలూ తీసుకుంటూ, ప్రభుత్వానికి సపోర్ట్ చెయ్యాలని తన సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.