వలస కూలీలపై రసాయనాలతో పిచికారి…!

-

కరోనా వైరస్ దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీనితో వేలాది మంది కూలీలు పొట్ట చేత పట్టుకుని సొంత ఊళ్లకు వెళ్ళిపోతున్నారు. వేలాది మంది కూలీలు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారత దేశానికి వచ్చారు. వారు అందరూ ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్లి సొంత ఊర్లో ఉండాలని అక్కడే ఏదోక పని చేసుకోవాలని భావిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా వారి విషయంలో అధికారులు ఇప్పుడు అనుసరిస్తున్న వైఖరి వివాదాస్పదంగా మారింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన వలస కార్మికుల పట్ల అక్కడి అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. అందరినీ రోడ్డుపై కూర్చోబెట్టి శానిటైజర్లు, రసాయనాలతో పిచికారీ చేశారు. వందల మందిపై ఇలాగే పిచికారి చేసారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడ పోలీసులు ఉన్నారు, ఇతర అధికారులు ఉన్నారు. అయినా సరే ఎవరూ కూడా అడ్డుకోలేదు.

దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ లు చేసే వాళ్ళ మీద ఇలాగే చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే డబ్బులు ఉన్న వాళ్ళ మీద కూడా ఇలాంటివి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరం అయితే క్వారంటైన్ కి తరలించాలి గాని ఈ విధంగా ప్రవర్తించడం ఏంటీ అంటూ మండిపడుతున్నారు. దీనిపై యుపి ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news