Naga Shaurya: “లక్ష్య” రిలీజ్ డేట్ ఫిక్స్.. నాగశౌర్య గురి కుదిరేనా…!

-

Naga Shaurya:  యంగ్ హీరో నాగశౌర్య.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో న‌టిస్తున్న తాజా చిత్రం ల‌క్ష్య‌ (lakshya movie). ఈ చిత్రానికి సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావ్, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శౌర్యకు జోడీగా కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది.

స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తుండగా కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా నాగ‌శౌర్య ఫ‌స్ట్ లూక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో శౌర్య‌ సిక్స్ ప్యాక్, పోనీ టెయిల్ తో కనిపించి ప్రేక్ష‌కులను తెగ ఆకట్టుకున్నాడు. దీంతో చిత్రంపై భారీ అంచ‌నాలు పెరిగాయి. ఎప్పుడెప్ప‌డూ రిలీజ్ అవుతుంద‌ని అభిమానులు వేచిచూస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఈ చిత్ర యూనిట్ అభిమానుల‌కు టాస్క్ ఇచ్చింది. ‘లక్ష్య’ రిలీజ్‌ డేట్‌ ఏమై ఉంటుందో గేస్‌ చేయండంటూ ఓ ప‌జిల్ విసిరింది. అందులో అక్టోబర్ 15, అక్టోబర్ 22, అక్టోబర్ 29, నవంబర్ 12 తేదీలు ఇచ్చింది. అభిమానులు చాలా మంది నవంబర్ 12 రిలీజ్ కావాల‌ని కోరుకుంటున్నార‌ని అందుకే ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 12న విడుద‌ల చేస్తున్న‌ట్టు డేట్ ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఇందులో ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. మరోవైపు.. నాగశౌర్య.. రీతూవర్మ జంటగా నటించిన స వరుడు కావలెను సినిమా అక్టోబర్ 15న విడుదల అవుతున్న విషయం తెలిసిందే

Read more RELATED
Recommended to you

Latest news