వాళ్లది ‘ఉగ్రవాద పాలసీ’ : జగన్ సర్కార్ పై పవన్ ట్వీట్

రిపబ్లిక్ మూవీ ఈవెంట్ లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… వైసిపి సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు… ఏపీ రాజకీయాల్లోనే కాకుండా… ఇటు టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోనూ …. హాట్‌ టాపిక్‌ గా మారాయి. మాటల యుద్ధం కాస్త.. ఇప్పుడు ట్విట్టర్‌ వార్‌ గా మారిపోయింది.

పవన్‌ కళ్యాణ్‌ మరియు మంత్రి పేర్ని నాని ఒకరిపై మరోకరు… వరుసగా ట్విట్లు పెట్టి తిట్టుకుంటున్నారు. నోటికొచ్చిన భాషను ట్విట్టర్‌ పోస్టుల్లో నింపేస్తున్నారు ఈ ఇద్దరూ నేతలు. ఇక తాజాగా… వైసీపీ సర్కార్‌ పై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మరో సంచలన ట్వీట్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వానిది ఉగ్రవాద పాలసీ అంటూ చురకలు అంటించారు పవన్‌ కళ్యాణ్‌. ”వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’ కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..” అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.